'సింహా' సినిమాతో ఆరేళ్ల దాహాన్ని తీర్చి అభిమానులకి పండగ చేసిన బాలకృష్ణ ఆ వెంటనే 'పరమవీరచక్'తో తన ఫ్లాప్ జోన్‌లోకి వెళ్లిపోయాడు. మళ్లీ బాలకృష్ణ నుంచి ఇప్పట్లో హిట్టొస్తుందా అనే అనుమానాలని రేకెత్తించాడు. అయితే అలా డీలా పడ్డ అభిమానులకో శుభవార్త. బాలకృష్ణ ఇమేజ్‌ని పర్‌ఫెక్ట్‌గా స్టడీ చేసి, ఆయనకి తగ్గ సినిమాని తెరకెక్కించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య మరో చిత్రం చేస్తున్నారు. బాలకృష్ణ కోసం బోయపాటి ఓ పవర్‌ఫుల్ లైన్ రెడీ చేశాడట. ఆ కథ విన్న బాలయ్య చాలా ఎక్సయిట్ అయ్యారని సమాచారం. ఈ చిత్రం కథ రెడీ అయినా కూడా పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత, 100% శాటిస్‌ఫాక్షన్ వచ్చాకే సెట్స్ మీదకి వెళ్లాలని బాలయ్య చెప్పారట. ఈ చిత్రం రిలీజ్ అయ్యే నాటికి రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఫాన్స్ ఉత్తేజితులయ్యేలా, బాలకృష్ణ మంచి ఊపు మీద ఉండాలని చూస్తున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో ఆయన ఏమాత్రం అజాగ్రత్త పడడం లేదు. దీనినిబట్టి రెండో సింహం ఖచ్చితంగా గర్జిస్తుందనే నమ్మాలి మరి.
You Are Here: Home» balakrishna , boyapati srinu , news , simha2 » కాంప్రమైజ్ కానంటున్న బాలకృష్ణ
0 comments